మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితులు నలుగురిని కస్టడీకి ఇవ్వాలని విజయవాడ కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి, ఈ కేసులో ఏ1గా ఉన్న కశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్‌గా ఉన్న బాలాజీ గోవిందప్పలను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోరారు. వీరు నలుగురిని కలిపి విచారించాల్సిన అవసరం ఉందని సిట్ బృందం పేర్కొంది.మద్యం ముడుపులు, కమిషన్ వ్యవహరంలో ఈ నలుగురికి తెలిసి కొన్ని విషయాలు జరిగాయని.. అందువల్లే నలుగురిని కలిపి విచారించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అప్పుడు మాత్రమే ఈ కేసు తదనంతర దర్యాప్తుకు అవకాశం ఉంటుందని తెలిపింది. సిట్ పిటిషన్‌పై రేపు (మంగళవారం) విచారణ జరిగే అవకాశం ఉంది. మరోవైపు రాజ్‌కసిరెడ్డి వాంగ్మూలం రికార్డు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విజయవాడ కోర్టులో మూడు రోజుల క్రితం పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌పై ఈరోజు ఏసీబీ కోర్టు విచారణకు రాగా.. కసిరెడ్డి వాంగ్మూలం రికార్డు చేసేందుకు తమకు అనుమతి ఇవ్వాలని ఈడీ తరపు న్యాయవాదులు కోరారు. విచారణను ఏసీబీ కోర్టు రేపటికి (మంగళవారం) వాయిదా వేసింది. ఇదే సమయంలో నలుగురు కీలక నిందితుల కస్టడీ పిటిషన్‌పై కోర్టు రేపు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తికరంగా మారింది.
![]() |
![]() |