కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేసి వారి న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు రవికుమార్ డిమాండ్ చేశారు. కార్మిక చట్టాలను కాలరాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మంగళవారం ఆర్ అండ్ బి బంగ్లా వద్ద గల అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను కాలు రాసి కొత్త చట్టాలను తీసుకొచ్చి కార్మిక యూనియన్లనే లేకుండా చేయాలని పన్నాగం పడుతుందని అన్నారు.
![]() |
![]() |