భారత్‌లో ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నిర్వహణపై అనిశ్చితి నెలకొంది. జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి.. ఆ తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య సైనిక ఘర్షణల కారణంగా ఆసియా కప్‌పై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆసియా కప్ రద్దయితే, ఆఫ్ఘానిస్తాన్, యూఏఈలతో కలిసి ముక్కోణపు సిరీస్ (ట్రై-సిరీస్) ఆడాలని పీసీబీ తొందరపడుతోంది. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
భారత్‌లో ఆసియా కప్ నిర్వహణపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాకపోవడంతో.. పీసీబీ ఈ దిశగా అడుగులు వేస్తోంది. వాస్తవానికి ఆసియా కప్ భారత్ వేదికగా సెప్టెంబర్‌లో జరగాల్సి ఉంది. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్తాన్ జట్టు భారత్‌కు వచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) హైబ్రిడ్ మోడల్‌ను అంగీకరించింది.
ఈ హైబ్రిడ్ విధానం ప్రకారం, భారత్ ఆడే మ్యాచ్‌లు యూఏఈలో జరుగుతాయి. అయితే, దీనిపై బీసీసీఐ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో పీసీబీ ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరుపుతోన్న పీసీబీ.. యూఏఈ వేదికగా ట్రై-సిరీస్ నిర్వహించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. అయితే ఆసియా కప్ రద్దయితేనే ఈ ట్రై-సిరీస్ నిర్వహణ సాధ్యమవుతుంది.
ఈ ట్రై-సిరీస్ నిర్వహించడంపై పీసీబీ చేస్తున్న ప్రయత్నాలను ఆ బోర్డు అధికారులు ఒకరు తెలిపారు. భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు సరిగా లేకపోవడంతో ఆసియా కప్ భారత్‌లో జరిగే అవకాశం లేదని ఆయన అన్నారు. అందుకే పీసీబీ మరో ప్రతిపాదనతో సిద్ధంగా ఉంది వెల్లడించారు. ఇదిలా ఉండగా, ఆగస్టులో ఆఫ్ఘానిస్తాన్ జట్టు పాకిస్తాన్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే, ఆసియా కప్ యూఏఈకి తరలిస్తే, ఆఫ్ఘనిస్తాన్, యూఏఈలతో కలిసి ట్రై-సిరీస్ ఆడాలని పీసీబీ భావిస్తోంది. అప్పుడు అఫ్ఘానిస్తాన్.. పాకిస్తాన్ పర్యటన రద్దవుతుంది. ఈ మేరకు రెండు బోర్డులతో పీసీబీ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
త్వరలో ఆసియా క్రికెట్ కౌన్సిల్- ACC అధ్యక్షుడు, PCB ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వి.. ఆసియా కప్‌పై నిర్ణయం తీసుకునేందుకు సమావేశం కానున్నారు. "ఆసియా కప్‌ను భారత్‌లో నిర్వహించేందుకు BCCI ఇంకా అంగీకారం తెలపలేదు. ACC సమావేశమై ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఈసారి ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో జరగనుంది" అని ఆయన నఖ్వి ఇటీవల అన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa