ప్రతి ఒక్కరి అందంలో జుట్టు కీలకపాత్ర పోషిస్తుంది. అయితే, ప్రస్తుత జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పొల్యూషన్ కారణంగా చాలా మంది అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా జుట్టు రాలడం ఒక సాధారణ సమస్యగా మారింది. జన్యుకారణాలు, హార్మోన్ల అసమతుల్యత, ఒత్తిడి, సరైన సంరక్షణ లేకపోవడం, ఆహారపు అలవాట్లు కారణంగా జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. జుట్టు రాలడంలో ఆహారం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కొన్ని ఆహారాలు అధికంగా తీసుకోవడం వల్ల జుట్టు మూలాలు బలహీనపడతాయి. బట్టతల వచ్చే ప్రమాదం పెరుగుతుంది. జుట్టు రాలుతూ బట్టతలకు కారణమయ్యే ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చక్కెర
చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇది శరీరంలో ఇన్సులిన్, ఆండ్రోజెన్ హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. ఈ హార్మోన్లు జుట్టు కుదుళ్లను కుదిస్తాయి. దీంతో, జుట్టు రాలడం ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా జుట్టు పెరుగుదల కూడా ఆగిపోతుంది. అధికంగా చక్కెర తీసుకోవడం వల్ల జుట్టు పెరుగుదలకు అవసరమైన పోషకాలు కుదుళ్లకు చేరవు. దీంతో, జుట్టు సన్నబడి, రాలిపోతుంది. అందుకే చక్కెర ఎక్కువగా ఉంటే స్వీట్స్, షుగరీ డ్రింక్స్‌కి దూరంగా ఉండండి.
ప్రాసెస్ చేసిన ఫుడ్స్
ప్రాసెస్ చేసిన ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల జుట్టు రాలడం పెరుగుతుంది. ముఖ్యంగా వైట్ బ్రెడ్, పాస్తా, కేకులు, బిస్కెట్లు వంటి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు శరీరంలోకి వెళ్ళినప్పుడు త్వరగా చక్కెరగా మారిపోతాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచి, ఇన్సులిన్ స్పైక్‌లకు దారితీస్తాయి. ఇది కూడా హార్మోన్ల అసమతుల్యతకు, ముఖ్యంగా ఆండ్రోజెన్ స్థాయిల పెరుగుదలకు కారణమై, జుట్టు రాలడాన్ని ప్రేరేపిస్తుంది. అందుకే ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
వేయించిన ఆహారాలు
వేయించిన ఫుడ్స్, ప్రాసెస్ చేసిన స్నాక్స్‌లో అనారోగ్యకరమైన కొవ్వులు, నూనెలు అధికంగా ఉంటాయి. ఇవి తల చర్మంపై సెబమ్ అంటే జిడ్డు ఉత్పత్తిని పెరిగేలా చేస్తాయి. దీంతో వెంట్రుకల కుదళ్లు క్లోజ్ అవుతాయి. దీంతో చుండ్రు, ఇన్ఫ్లమేషన్ ఏర్పడి జుట్టు ఆరోగ్యం బలహీనపడుతుంది. సాధారణంగానే జంక్ ఫుడ్‌లో పోషకాలు తక్కువగా ఉంటాయి. దీంతో, జుట్టుకు కావాల్సిన పోషణ అందదు. దీంతో, జుట్టు రాలడం ఎక్కువై.. బట్టతల వంటి సమస్యలు వస్తాయి. అందుకే ఈ ఫుడ్స్‌ని అవాయిడ్ చేయాలి.
మద్యపానం
మద్యపానం అలవాటు ఆరోగ్యానికి మాత్రమే జుట్టుకు హాని చేస్తుంది. ఆల్కహాల్ తాగడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ సమస్య పెరుగుతుంది. అంతేకాకుండా ఇది తాగడం వల్ల జింక్‌తో పాటు ముఖ్యమైన పోషకాలను కూడా తగ్గిస్తుంది. జింక్ లోపం జుట్టు పెరుగుదల ఆగిపోతుంది. దీంతో, జుట్టు రాలడం పెరుగుతుంది. ఆ తర్వాత బట్టతల సమస్య కూడా వస్తుంది. అందుకే మద్యపానాన్ని దూరంగా ఉండటం మేలు అంటున్నారు నిపుణులు.
కెఫిన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్
కెఫిన్ అధికంగా ఉండే డ్రింక్స్ తీసుకోవడం వల్ల శరీరంలో తగినంత నీటి స్థాయిలు ఉండవు. దీంతో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. దీని వల్ల తల చర్మం పొడిగా, నిర్జీవంగా మారుతుంది. ఈ కెఫిన్ ఎక్కువగా ఉండే ఆహారాలు జుట్టు పెరుగుదలపై ప్రభావం చూపుతాయి. జుట్టు రాలడం సమస్య కూడా పెరుగుతుంది.
వీటిని తిన్నా జుట్టు రాలిపోతుంది
* అధిక ఉప్పు శరీరంలో డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది. దీని వలన తల చర్మం పొడిగా, డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఇది జుట్టు మూలాలను బలహీనపరుస్తుంది. దీనివల్ల అవి త్వరగా రాలిపోతాయి.
* కొంతమందికి పాల ఉత్పత్తులు అలెర్జీగా ఉంటాయి. ఇది తల చర్మం వాపు, చుండ్రుకు కారణమవుతుంది. దీనివల్ల జుట్టు బలహీనంగా మారి త్వరగా రాలిపోవడం ప్రారంభమవుతుంది.
* అధిక ప్రోటీన్ సప్లిమెంట్లు శరీరంలో ఆమ్ల ప్రభావాన్ని కలిగిస్తాయి. ఇది కాల్షియం లోపానికి దారితీస్తుంది. ఇది జుట్టు బలాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా జుట్టు రాలడాన్ని పెంచుతుంది.
* ట్యూనా, షార్క్, స్వోర్డ్‌ఫిష్ వంటి కొన్ని పెద్ద సముద్రపు చేపలలో పాదరసం ఎక్కువగా ఉండవచ్చు. వీటిని తినడం వల్ల జుట్టు రాలడం, బట్టతల సమస్యలు రావచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
తీసుకోవాల్సిన ఫుడ్స్, జాగ్రత్తలు
తీసుకోవాల్సిన ఫుడ్స్, జాగ్రత్తలు
* ప్రోటీన్లు - గుడ్లు, పప్పులు, చికెన్
* విటమిన్లు - పండ్లు, కూరగాయలు
* ఖనిజాలు - ఆకుకూరలు, గింజలు
* ఆరోగ్యకరమైన కొవ్వులు - అవకాడో, నట్స్, ఆలివ్ ఆయిల్
* తగినంత నీరు తాగడం వల్ల జుట్టు హైడ్రేటెడ్‌గా ఉంటుంది
* ఒత్తిడి వల్ల కూడా జుట్టు రాలుతుంది. అందుకే యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి జీవనశైలిలో భాగం చేసుకోండి.
* రసాయనాలు తక్కువగా ఉండే షాంపూలు, కండిషనర్‌లు వాడటం
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa