Itel Super 26 Ultra: అధునాతన ఫీచర్లతో బడ్జెట్ బీస్ట్ లాంచ్!
ప్రసిద్ధ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ అయిన Itel, తన కొత్త Itel Super 26 Ultra స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఆకర్షణీయమైన ఫీచర్లు, భారీ బ్యాటరీ సామర్థ్యం, శక్తివంతమైన ప్రాసెసర్‌తో ఈ ఫోన్ వినియోగదారులకు స్మార్ట్, పవర్ఫుల్ అనుభవాన్ని అందించేందుకు సిద్ధమైంది.డిస్ప్లే విషయంలో చూస్తే, ఫోన్లో 6.78-inch 1.5K 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్ ఉంది, ఇది 144Hz రిఫ్రెష్ రేట్ తో స్మూత్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుంది. Corning Gorilla Glass 7i ప్రొటెక్షన్‌తో పాటు, "Rain-proof" టెక్నాలజీ వల్ల తడి లేదా తేమతో కూడిన వాతావరణంలో కూడా స్క్రీన్ సజావుగా పనిచేస్తుంది.కెమెరా సెటప్‌లో, డ్యూయల్ రియర్ కెమెరాతో పాటు 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ లభిస్తాయి. సెల్ఫీల కోసం ముందువైపు 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. IP65 రేటింగ్ వలన ఇది ధూళి, నీటి చిమ్మురల నుంచి రక్షణ కల్పిస్తుంది.పర్ఫార్మెన్స్ పరంగా, ఇందులో 6nm Unisoc T7300 చిప్సెట్ ఉపయోగించబడింది. ఇది 8GB RAM తో పాటు 128GB లేదా 256GB స్టోరేజ్ వేరియంట్లలో లభించనుంది.ఇంకా అదనంగా, ఫోన్లో NFC, Wi-Fi, బ్లూటూత్, IR ట్రాన్స్మిట్టర్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ప్రత్యేకంగా, AI కెమెరా ఎరేజర్, Circle to Search, అలాగే ఇంటెలిజెంట్ AI అసిస్టెంట్ 'Sole' వంటి ఆధునిక AI ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.బ్యాటరీ పరంగా, 6000mAh బ్యాటరీ తో పాటు 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. అంతేకాకుండా, ఈ ఫోన్ కేవలం 6.8mm మందం మాత్రమే ఉండి, చాలా స్లిమ్‌గా ఉంటుంది.ప్రస్తుతం ఈ ఫోన్ నైజీరియాలో ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉంది. సెప్టెంబర్ 15 నుండి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఇది బీజ్, బ్లూ, గోల్డ్, గ్రే రంగుల్లో లభిస్తుంది.
ధరల విషయానికి వస్తే: బంగ్లాదేశ్‌లో
8GB + 128GB వేరియంట్ ధర: BDT 19,990 (రూ. 14,900)
8GB + 256GB వేరియంట్ ధర: BDT 21,990 (రూ. 15,900)
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa