జీఎస్టీ కొత్త శ్లాబులు సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. జీఎస్టీ పునర్నిర్మాణాన్ని సరళమైన, న్యాయమైన పన్ను వ్యవస్థ వైపు విప్లవాత్మక అడుగు అని పేర్కొన్నారు. ఈ చర్యలు సామాన్యులకు సరళత, ఆర్థిక లాభాలను అందిస్తాయని తెలిపారు. తాజా సవరణలు బిల్లింగ్, పాలనను సులభతరంగా చేయడం, పన్ను అధికారుల భారం తగ్గించడంలో తోడ్పడతాయని జగన్ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa