AP: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ధ్వజారోహణానికి ముందు రోజు చేపట్టే అంకురార్పణను మంగళవారం ఆలయ సన్నిధిలో రాత్రి 7 నుంచి 8 గంటల వరకు నిర్వహిస్తారు. తొలుత ఆలయానికి నైరుతి దిశగా భూదేవిని పూజించి మన్ను సేకరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. అందులో నవధాన్యాలు ఆరోపింపజేసి క్రతువును శాస్త్రోక్తంగా చేపట్టనున్నారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా తిరుమల బ్రహ్మోత్సవాలపై ఉపగ్రహ నిఘా ఉంచనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa