మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బుధవారం వైసీపీ విసృతస్థాయి సమావేశంలో కొత్త యాప్‌ను లాంచ్ చేశారు. ఈ యాప్‌కు డిజిటల్ బుక్ అనే పేరును పెట్టారు. ఈ యాప్‌ను అన్యాయానికి గురవుతున్న వైసీపీ కార్యకర్తల కోసం తీసుకొచ్చామని జగన్ వెల్లడించారు. అక్రమ కేసులు, అధికార పార్టీ నాయలకు వేధింపులు, స్థానిక సమస్యలను ఈ యాప్ ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అయితే ఇటీవలే జగన్ రెడ్‌బుక్ తరహాలోనే డిజిటల్ యాప్‌ను తీసుకొస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa