AP: ఇప్పటికే టమాటా, ఉల్లి, మామిడి, బొప్పాయి ధరలు పడిపోగా.. తాజాగా ఇదే బాటలో అరటి చేరింది. పది రోజుల ముందు వరకు రూ.15-18 వేలు పలికిన టన్ను అరటి ఒక్కసారిగా రూ.5-7 వేలలోపు పడిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. వ్యాపారుల తీరుపై భగ్గుమంటున్నారు. అరటికి మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే ఇతర రాష్ట్రాల్లో వర్షాలు పడుతుండటం, ఇతర అనేక కారణాలతో ధరలు తగ్గినట్లు ఉద్యానశాఖ అంచనా వేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa