ఉత్తరాఖండ్‌లో ఉపాధ్యాయులు తమ సమస్యల పరిష్కారం కోసం వినూత్న రీతిలో నిరసనకు దిగారు. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ, ఓ ఉపాధ్యాయుడు ఏకంగా తన రక్తంతో ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం తమ గోడును వినకపోవడంతో, ప్రధాని దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు ఆయన తెలిపారు.చంపావత్ జిల్లా తనక్‌పుర్‌లోని ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో అసిస్టెంట్ టీచర్‌గా పనిచేస్తున్న రవి బాగోటి ఈ లేఖను రాశారు. ఆయన రాష్ట్ర ఉపాధ్యాయ సంఘంలో ప్రాంతీయ సభ్యుడిగా కూడా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది టీచర్లు గత నెల రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని, అందుకే ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరుతూ ఈ లేఖ రాసినట్లు రవి పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa