AP: అనకాపల్లి జిల్లా సాయకరావుపేటకు చెందిన సయ్యద్ హీరా (22)కు ఐదేళ్ల క్రితం పాతనామవరానికి చెందిన సయ్యద్ బహీరుద్దీన్‌తో వివాహమైంది. అప్పటి నుంచి అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని హీరా తన తల్లిదండ్రుల వద్ద వాపోయేది. సర్దుకుపోవాలని ఆమెకు వారు నచ్చజెప్పేవారు. ఈ నెల 25న హీరా ఉరేసుకుని చనిపోయినట్లు వారికి సమాచారం వచ్చింది. కట్నం కోసం అల్లుడు, అతని కుటుంబ సభ్యులు చంపి ఉంటారని మృతురాలి తల్లి షేక్ వల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa