ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన సీఎం శ్రీ (CM SHRI) స్కూళ్లలో 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్న నిర్ణయంపై ఒక 11 ఏళ్ల విద్యార్థి, జన్మేశ్ సాగర్, సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ నిర్ణయం విద్యార్థులకు ఒత్తిడిని కలిగిస్తోందని, ఇది చిన్నారుల హక్కులకు వ్యతిరేకమని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నాడు.
విద్యార్థి జన్మేశ్ తన రిట్ పిటిషన్‌లో ఉచిత మరియు నిర్బంధ విద్య హక్కు చట్టం (RTE Act, 2009) ప్రకారం, 6-14 సంవత్సరాల వయసు పిల్లలకు పూర్తిగా ఉచితంగా మరియు పరీక్షల ఒత్తిడి లేకుండా విద్య కల్పించాలని పేర్కొన్నారు. ప్రవేశ పరీక్షలు నిర్వహించడం ఈ చట్టానికి విరుద్ధమని ఆయన వాదించారు.
2025 జులై 23న ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌ను సవాలు చేస్తూ, జన్మేశ్ ఈ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరాడు. అదేవిధంగా, ప్రవేశాలను పూర్తిగా పారదర్శకంగా, లాటరీ విధానంలో ఇవ్వాలని కోరుతూ పిటిషన్ వేశారు.
ఈ కేసు దేశవ్యాప్తంగా విద్యావ్యవస్థపై తీవ్ర చర్చకు దారితీసే అవకాశం ఉంది. చిన్న వయసులోనే విద్యార్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, విద్యావ్యవస్థలో లోపాలపై అవగాహన కలిగి ఉండటం మంచి పరిణామంగా భావించబడుతోంది. ఈ కేసుపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa