ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ అదిరే శుభవార్త చెప్పింది. ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతా నుంచి డబ్బులు ఉపసంహరణకు సంబంధించిన నిబంధనల సరళీకరణకు ముందుకొచ్చింది. ఇప్పుడు పీఎఫ్ ఖాతాదారులు ఉద్యోగి, యజమాని వాటా సహా పీఎఫ్ అకౌంట్లోని నిధుల్లో ఉపసంహరించుకోగల బ్యాలెన్సులో 100 శాతం విత్ డ్రా చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ నేతృత్వంలో జరుగుతోన్న ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఏడు కోట్లకు పైగా ఉన్న పీఎఫ్ ఖాతాదారులకు ప్రయోజనం కలగనుంది.
సీబీటీ కీలక నిర్ణయాలు ఇవే
ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీఎఫ్ పాక్షిక ఉపసంహరణకు సంబంధించి 13 సంక్లిష్టమైన రూల్స్‌ను ఒకే నిబంధనగా క్రమబద్దీకరించింది సీబీటీ. మూడు రకాలుగా విభజించింది. అందులో ముఖ్యమైన అవసరాలు (అనారోగ్యం, విద్య, వివాహం), గృహ అవసరాలు, ప్రత్యేక పరిస్థితులుగా వర్గీకరించింది. అలాగే పీఎఫ్ విత్ డ్రా పరిమితులను సైతం పెంచింది. పిల్లల చదువుల కోసం 10 సార్లు తీసుకోవచ్చు. అలాగే వివాహం విషయంలో 5 సార్లు వరకు పార్శియల్ విత్ డ్రాకుఅవకాశం కల్పిస్తోంది. ప్రస్తుత రూల్స్ ప్రకారం అయితే ఈ రెండు అవసరాలకు 3 సార్ల వరకే లిమిట్ ఉంటుంది.
మరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల పాక్షిక ఉపసంహరణలకు పీఎఫ్ ఖాతాదారుల కనీస సర్వీసును ఏడాదికి (12 నెలలకు) తగ్గించింది. గతంలో ప్రత్యేక పరిస్థితులు ఆప్షన్ కింద పార్శియల్ పీఎఫ్ విత్ డ్రాకు నిరుద్యోగం, పకృతి విపత్తులు, కంపెనీల మూసివేత వంటి కారణాలు మాత్రమే చూపాల్సి ఉండేది. కానీ ఇప్పుడు ఎలాంటి కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు. కారణాలు లేకుండానే దరఖాస్తు చేసుకుని పీఎఫ్ విత్ డ్రా చేసుకోవచ్చు. అలాగే పీఎఫ్ అకౌట్లో జమ చేసే మొత్తంలో 25 శాతాన్ని కనీస బ్యాలెన్స్‌గా ఉంచేలా రూల్ తీసుకొచ్చారు. తద్వారా ఈపీఎఫ్ఓ అందించే అధిక వడ్డీ (ప్రస్తుతం 8.25 శాతం) ద్వారా పెద్ద మొత్తంలో పదవీ విరమణ ప్రయోజనాలు పొందేందుకు దోహదపడుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa