నోములు, వ్రతాలు, పండుగల సమయంలో కలశం పెట్టి పూజ చేసేటప్పుడు కొబ్బరికాయను అమ్మవారిగా భావించి పూజిస్తారు. పూజ పూర్తయ్యాక ఆ కొబ్బరికాయను తినడం వల్ల శుభ ఫలితాలు, సానుకూల శక్తి లభిస్తాయని, ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని నమ్మకం. కొబ్బరికాయను ఎప్పుడూ వృధా చేయకూడదు. పూజలో సమర్పించిన కొబ్బరికాయను ఆలయానికి తీసుకెళ్లి భక్తులకు పంచడం వల్ల కుటుంబంలో ప్రేమ, ఐక్యత పెరుగుతాయని పండితులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa