గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు మేడికొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పేరేచర్ల జంక్షన్ వద్ద సైబర్ భద్రతపై అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. పోలీస్ సిబ్బంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రజలకు ఆన్‌లైన్ మోసాల నివారణపై సూచనలు అందించారు. అనుమానాస్పద లింకులు, సందేశాలు, లేదా ఫ్రెండ్ రిక్వెస్టులు ఓపెన్ చేయకూడదని హెచ్చరించారు. బ్యాంక్ వివరాలు, పాస్‌వర్డ్‌లు, OTPలు వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని ప్రజలను అప్రమత్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa