హత్య సినిమాలో తన తల్లి పాత్రను అసభ్యంగా చిత్రీకరించారని మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో హత్య సినిమా యూనిట్‌కు సునీల్ కుమార్ యాదవ్ శుక్రవారం నోటీసులు పంపారు. ఈ అంశంపై ఏడు రోజుల్లో తనకు సమాధానం ఇవ్వాలని సినిమా యూనిట్‌ను డిమాండ్ చేశారు. అలా చేయకుంటే.. రూ. 5 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని హత్య సినిమా యూనిట్‌కు స్పష్టం చేశారు. ఆ క్రమంలో శుక్రవారం సుప్రీంకోర్టు అడ్వకేట్ ద్వారా సదరు సినిమా యూనిట్‌కు సునీల్ నోటీసులు ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa