ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రెగ్నెన్సీ మొదటి 3 నెలల్లో ఎక్సర్‌సైజెస్ అస్సలు చేయొద్దు

Life style |  Suryaa Desk  | Published : Fri, Nov 14, 2025, 10:45 PM

​ప్రెగ్నెన్సీ అయింది మొదలు డెలివరీ వరకూ ఆడవారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ముఖ్యంగా మొదటి 3 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఈ టైమ్‌లో బరువులు ఎత్తడం, జర్నీలు చేయడం, వేడి వస్తువులు తినడం వంటివి చేయొద్దు. దీంతో పాటు కొన్ని వర్కౌట్స్‌ని కూడా అవాయిడ్ చేయాల్సిందే. స్టార్టింగ్ స్టేజ్‌లోనే మిస్ క్యారేజెస్‌కి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి, అలాంటి వాటిని మనం అవాయిడ్ చేస్తే చాలా వరకూ మనం అబార్షన్ రిస్క్‌ని తప్పించుకోవచ్చు. దీని గురించి యోగా టీచర్ రాధిక చెబుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో ప్రెగ్నెన్సీ ఫస్ట్ ట్రైమెస్టర్‌లో కొన్ని ఎక్సర్‌సైజెస్‌ని అసలే చేయకూడదని, మరికొన్నింటిని యాడ్ చేయాలని చెబుతున్నారు. ఆమె ప్రకారం, ఏ వర్కౌట్ చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకోండి.


ఇంటెన్సిటీ వర్కౌట్స్


ప్రెగ్నెన్సీ టైమ్‌లో కష్టమైన వర్కౌట్స్ అవాయిడ్ చేయాలి. నిజానికీ ఇంటెన్సిటీ వర్కౌట్స్ చాలా కష్టంగా ఉంటాయి. వీటిని చేయడం వల్ల బాడీలో టెంపరేచర్ పెరుగుతుంది. హెవీ జంప్స్, లిఫ్టింగ్ వంటి పనులు తల్లీ, కడుపులోని బిడ్డకి ప్రమాదమే. కాబట్టి, ఇలాంటివి అసలే చేయకూడదు. వీటిని కచ్చితంగా అవాయిడ్ చేయాల్సిందే. లేదంటే సమస్యల్నీ కోరి తెచ్చుకున్నవారవుతారు.


డీప్ హిప్ ఓపెనర్స్


కొంతమంది నార్మల్ టైమ్‌లో హిప్ ఓపెన్ చేసి కిందకి వంగి వర్కౌట్స్ చేస్తారు. ప్రెగ్నెన్సీ కోసం డీప్ హిప్ ఓపెనింగ్ వర్కౌట్స్‌లో గార్లాండ్ పోజ్ మలసానా, బటర్ ఫ్లై పోజ్, హిప్ ఫ్లెక్సర్ స్ట్రెచెస్ ఉన్నాయి. వీటిని చేయకపోవడమే మంచిది. వీటి వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, వీటిని అవాయిడ్ చేయడమే మంచిది. ఇలా కిందకి కూర్చోవడం, సడెన్‌గా పైకి లేవడం వంటివి చేయొద్దు. దీంతో పాటు కొంతమంది వంగి బట్టలు నీటిలో తీయడం చేస్తారు. అలా చేయొద్దు.


ఏం చేయాలి.


సరల్ విపరీత కరణిదీనిని గోడకి ఆనుకుని కాళ్ళని పైకి ఎత్తే పోజ్ అని చెప్పొచ్చు. ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఇది మంచిది. దీని వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. మంచి సపోర్ట్, జాగ్రత్తలతో చేయొచ్చు. ఇది ప్రెగ్నెన్సీలో వచ్చే సమస్యల్ని తగ్గించొచ్చు. కానీ, ముఖ్యంగా నెలలు గడిచే కొద్దీ ఈ వర్కౌట్ చేసే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. ఎందుకంటే, మీ బేబి పొజిషన్‌ని బట్టి ఇలాంటి వర్కౌట్స్ చేయొచ్చో లేదా చెబుతారు.


ప్రెగ్నెన్సీలో చేయకూడని వర్కౌట్స్


డీప్ బ్రీథింగ్


ప్రెగ్నెన్సీలో డీప్ బ్రీథింగ్ తీసుకోవడం మంచిది. ఒత్తిడి, ఆందోళనను నిర్వహించడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. శ్వాస ఆడకపోవడం వంటి అసౌకర్యాలను తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. కీలకమైన పద్ధతులలో లోతైన ఉదరశ్వాస, ఇది ఆక్సిజన్ తీసుకోవడం పెంచుతుంది. ప్రసవ సమయంలో ప్రశాంతంగా, దృష్టి కేంద్రీకరించడానికి ఉపయోగించే వివిధ లయబద్ధమైన శ్వాస విధానాలు ఉన్నాయి. శ్వాస ఆడకపోవడం అకస్మాత్తుగా లేదా తీవ్రంగా ఉంటే రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయడం, వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.


మెడిటేషన్


మెడిటేషన్ చేయడం కూడా చాలా మంచిది. దీని వల్ల తల్లీ, బిడ్డలిద్దరికీ చాలా మంచివి. వీటి వల్ల ఒత్తిడి, ఆందోళనని తగ్గించడంలో నిద్ర నాణ్యతని మెరుగుపరచడంలో, ప్రశాంతతని పెంపొందించడంలో సాయపడతాయి. మంత జపం, డీప్ బ్రీథ్, మైండ్‌ఫుల్‌నెస్, విజువలైజేషన్ వంటి పద్ధతులు సాధారణంగా ఉపయోగించబడతాయి. కానీ, మీకు సౌకర్యవంతమైన అభ్యాసాన్ని కనుగొనడం ఉత్తమం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa