రాయ్‌పూర్–విశాఖపట్నం ప్రయాణ సమయం త్వరలో 12 గంటల నుండి 5 గంటలకు తగ్గనుంది. ఇందుకోసం కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ రూ.16,482 కోట్లతో 465 కిమీ గ్రీన్‌ఫీల్డ్ ఆరు లైన్‌ల హైవే నిర్మిస్తోంది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లను కలిపే ఈ ఎకనామిక్ కారిడార్‌ను డిసెంబర్ 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాజెక్టు పూర్తయ్యాక రైతుల భూముల విలువ పెరుగుతుంది, ట్రక్కుల సమయం–ఖర్చులు తగ్గుతాయి. గిరిజన ప్రాంతాలకు కూడా మెరుగైన రవాణా సౌకర్యం లభిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa