దేశీయ అగ్రగామి విమానయాన సంస్థ ఇండిగోకు జీఎస్టీకి సంబంధించి దాదాపు రూ.59 కోట్ల జరిమానా పడింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను దిల్లీ సౌత్ కమిషనరేట్‌లోని సీజీఎస్టీ అడిషనల్ కమిషనర్ రూ.58.74 కోట్ల జరిమానా విధించినట్లు బీఎస్‌ఈ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఇండిగో పేర్కొంది. అయితే, అధికారుల తప్పిదంతో ఈ ఆదేశాలు జారీ అయినట్లు భావిస్తున్నామని, దీనిపై సంబంధిత విభాగంలో అప్పీలుకు వెళ్తామని తెలిపింది. సంస్థ ఆర్థిక, ఇతర కార్యకలాపాలపై గణనీయ ప్రభావం ఉండదని వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa