పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాడీవేడీగా సాగుతున్న తరుణంలో, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సీనియర్ ఎంపీ సౌగతా రాయ్ పార్లమెంట్ ఆవరణలో సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కారు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీజేపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజారోగ్యం, సభ గౌరవంపై దీని ప్రభావం ఉంటుందని కేంద్ర మంత్రులు గిరిరాజ్ సింగ్, గజేంద్ర సింగ్ షెకావత్ ఆందోళన వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa