ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో, నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై శనివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగా 12కు పైగా కార్లు, ట్రక్కులు ఒకదానికొకటి వరుసగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదం కారణంగా ఎక్స్‌ప్రెస్‌వేపై కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక చర్యలు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa