తిరుమల శ్రీవారి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. న్యూఇయర్, సంక్రాంతి పండుగల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, మూడు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. తిరుపతి-చర్లపల్లి రైలు డిసెంబరు 16 నుంచి 30 వరకు, చర్లపల్లి-తిరుపతి రైలు డిసెంబరు 19 నుంచి జనవరి 2 వరకు, పంధర్పూర్-తిరుపతి రైలు డిసెంబరు 21 నుంచి జనవరి 4 వరకు నడుస్తాయి. ఈ రైళ్లు ప్రధాన రైల్వే స్టేషన్లలో ఆగనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa