విశాఖపట్నంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందంగా సిద్ధమవుతోందని, వచ్చే నెలలో ట్రయల్ రన్ నిర్వహిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు. విశాఖలోని రాడిసన్ బ్లూ రిసార్టులో రాష్ట్ర మంత్రి లోకేశ్ సమక్షంలో జీఎంఆర్-మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రాజెక్టుకు సంబంధించిన ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే ఏడాది జూన్ నాటికి విమానాశ్రయాన్ని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అయితే ఒక నెల ముందుగానే అందుబాటులోకి వస్తుందని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa