వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం భారత స్క్వాడ్ ఎంపిక ఆసక్తి రేపుతోంది. ఫామ్‌లో లేని శుభ్‌మన్ గిల్‌పై వేటు పడనుందనే ఊహాగానాల నేపథ్యంలో, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్లో ఇషాన్ కిషన్ 45 బంతుల్లోనే సెంచరీతో అదరగొట్టాడు. ఈ విధ్వంసక ఆటతో ప్రపంచకప్ స్క్వాడ్‌కు గట్టి పోటీ ఇస్తున్నాడు. గిల్ టెస్టు, వన్డేల్లో రాణిస్తున్నా టీ20ల్లో తేలిపోతున్నాడు. దక్షిణాఫ్రికాపై మూడు మ్యాచుల్లోనూ గిల్ దారుణంగా విఫలమయ్యాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా సఫారీలపై పేలవ ప్రదర్శన చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa