రైలు టికెట్ల బుకింగ్‌లో రెంటల్ సాఫ్ట్‌వేర్ల వినియోగంపై వార్తలు వస్తున్నాయి. కొందరు ఏజెంట్లు 'టెస్లా', 'గదర్' వంటి సాఫ్ట్‌వేర్‌లను నెలకు రూ.1200-3200 అద్దెకు తీసుకుని, 50 సెకన్లలో తత్కాల్ టికెట్లను బుక్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సాఫ్ట్‌వేర్‌లు సాధారణ వినియోగదారుల కంటే వేగంగా పనిచేస్తాయి. చట్టపరమైన లొసుగులు, ఏజెంట్లు ఎప్పటికప్పుడు ఐపీ అడ్రస్‌లు, యూజర్ ఐడీలు మార్చడం వంటి కారణాల వల్ల ఐఆర్‌సీటీసీ వీటిని పూర్తిగా అరికట్టలేకపోతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa