చీరాల వీ రిసార్ట్స్‌లో 'రోలెక్స్' సినిమా చిత్రీకరణ జరుగుతున్న సందర్భంగా, ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య చిత్ర యూనిట్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన సినిమా చిత్రీకరణకు క్లాప్ కొట్టి, కెమెరా స్విచ్ ఆన్ చేశారు. చీరాలలో సినిమా షూటింగ్ జరుగుతున్నందుకు చిత్ర యూనిట్‌ను ఎమ్మెల్యే అభినందించారు. ఈ చిత్రం ఐదు భాషల్లో తెరకెక్కుతోందని నిర్మాత అంబటి మధుమోహన్ కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరో కోమల్ కుమార్, హీరోయిన్ సోనాల్ మోంటెరో, డైరెక్టర్ శ్రీనివాస్ సి, సినిమాటోగ్రఫీ రాకేష్ సి తిలక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మురళీ కృష్ణ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa