ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు దంపతులు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 05, 2026, 11:54 AM

అమెరికాలోని వాషింగ్టన్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన కొటికలపూడి కృష్ణ కిశోర్ (45), ఆశ (40) దంపతులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో వారి కుమార్తె, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న కృష్ణ కిశోర్ 10 రోజుల క్రితమే పాలకొల్లు వచ్చి తిరిగి వెళ్లారు. దుబాయ్లో న్యూఇయర్ వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఈ దుర్ఘటన జరిగింది. వీరి మృతితో పాలకొల్లులో విషాదఛాయలు అలుముకున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa