మైలవరం(M)లోని వెల్వడంలో 'వీబీ- జీ రామ్ జీ' పథకంపై సోమవారం గ్రామసభ జరిగింది. ఎమ్మెల్యే కృష్ణప్రసాదు మాట్లాడుతూ, వికసిత్ భారత్-2047 లక్ష్యాలకు అనుగుణంగా, ఆధునిక గ్రామీణ అవసరాలకు తగినట్లుగా పాత పథకంలో మార్పులు చేసి ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్న కూలీలకు ఈ చట్టం సంవత్సరంలో 125 రోజులు ఉపాధి హామీ ఇస్తుందని ఆయన వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa