AP: అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లా సమీపంలోని యానాం పరిధి దరియాలతిప్ప వద్ద గోదావరిలో ఓ మత్స్యకారుడి వలకు 24 కిలోల భారీ పండుగప్ప చేప చిక్కింది. ఇటీవల ఇంత పెద్ద చేప దొరకలేదని స్థానికులు తెలిపారు. చెరువుల్లో పెరిగే పండుగప్ప చేపలు ఆరు కిలోల వరకే ఉంటాయని, నది చేప కావడంతో ఇంతలా పెరిగిందని మత్స్యకారులు పేర్కొన్నారు. ఈ చేపను రూ.16 వేలకు విక్రయించారు. పండుగప్ప చేపలో ప్రొటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయని, ఇది మెదడు, గుండె, ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుందని మత్స్యశాఖ అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa