కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కంధనాతిలో సోమవారం పాతకక్షలు భగ్గుమన్నాయి. స్థానికులైన వెంకటేశ్, పరమేశ్, గోవింద్‌పై ప్రత్యర్థులు వేటకొడవళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో వెంకటేశ్, పరమేశ్ అక్కడికక్కడే మృతి చెందగా, గోవింద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. గాయపడిన గోవింద్‌కు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు, గోవింద్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసినట్లు తెలిపారు. కేసును త్వరగా ఛేదిస్తామని హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa