ప్రముఖ ఆహార పానీయాల దిగ్గజం నెస్లే తన శిశువుల ఫార్ములా పాల ఉత్పత్తులలో ప్రమాదకరమైన టాక్సిన్ ఉన్నట్లు గుర్తించి, ప్రపంచవ్యాప్తంగా పలు బ్యాచ్‌లను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. SMA,BEBA,NAN వంటి బ్రాండ్లు ఈ రీకాల్ పరిధిలోకి వచ్చాయి. ఒక సరఫరాదారు నుంచి సేకరించిన పదార్ధంలో నాణ్యత లోపం వల్ల 'సిర్యూలైడ్' అనే టాక్సిన్ ఉండే ప్రమాదం ఉందని సంస్థ గుర్తించింది. ఈ టాక్సిన్ కలిగిన ఆహారాన్ని శిశువులు తీసుకుంటే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే ఇప్పటి వరకు ఈ ఉత్పత్తుల వల్ల ఎవరికీ అనారోగ్యం కలిగినట్లు ఆధారాలు లేవని, కేవలం ముందు జాగ్రత్త చర్యగా మాత్రమే వీటిని వెనక్కి తీసుకుంటున్నట్లు నెస్లే తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa