భారత్–న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా మిగిలిన రెండు వన్డేలకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అతడి స్థానంలో ఢిల్లీ యువ బ్యాటర్ ఆయుష్ బదోనిని జట్టులోకి తీసుకుంది. ప్రస్తుతం సుందర్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. రెండో వన్డే నాటికి బదోని జట్టుతో చేరనున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa