ప్రస్తుత బిజీ జీవితంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న అలసట, ఏకాగ్రత లోపం, ఒత్తిడికి పోషకాహార లోపం కూడా ఒక ముఖ్య కారణమని నిపుణులు చెబుతున్నారు. ఐరన్, విటమిన్ B12, విటమిన్ D, మెగ్నీషియం, ఓమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు వంటి పోషకాల లోపం శక్తి, మానసిక స్థితి, ఉత్సాహంపై ప్రభావం చూపుతుంది. ఈ పోషకాల లోపాన్ని సరిచేయడానికి ఆహారంలో పాలకూర, పప్పులు, గుడ్లు, చేపలు, నట్స్, విత్తనాలు వంటివి చేర్చుకోవాలని, సరైన రక్త పరీక్షల తర్వాతే సప్లిమెంట్స్ వాడాలని సూచిస్తున్నారు. సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా పనితీరు, శక్తి, హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరచుకోవచ్చని నిపుణులు అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa