ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షుగర్ ఉన్నవారు ఏం తింటే డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది

Health beauty |  Suryaa Desk  | Published : Wed, Jan 21, 2026, 12:02 AM

డయాబెటిస్ రాగానే చాలా మంది కంగారుపడిపోతారు. కానీ, ఇది నేడు కామన్ ప్రాబ్లమ్‌గా మారింది. దీనిని మనం ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకోవడానికి సరైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇందులో మంచి ఫుడ్ కూడా కీ రోల్ పోషిస్తుంది. కాబట్టి, మంచి ఫుడ్ ఐటెమ్స్ తీసుకోవాలి. కొన్ని ఇండియన్ ఫుడ్స్‌ తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్, ఇన్సులిన్‌ పనితీరుకి హెల్ప్ చేసే సహజ సమ్మేళనాలు ఉంటాయి. అలాంటి ఫుడ్స్ తింటే నేచురల్‌గానే షుగర్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం.


పాలకూరతో మేలు


​పాలకూరలోని గుణాలు బాడీలోని షుగర్‌ని మెరుగ్గా ఉపయోగించడానికి హెల్ప్ చేస్తుంది. దీని వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ బ్యాలెన్స్ అవుతాయి. ఇందులో లో గ్లైసెమిక్ ఇండెక్స్‌తో పాటు హై ఫైబర్, రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది మన బాడీలో షుగర్ అబ్జార్బ్‌ని మెల్లిగా జరిగేలా చేస్తుంది. దీంతో పాటు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగ్గా చేస్తుంది. ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గిస్తుంది. గ్లూకోజ్ లెవల్స్‌ని స్టెబిలైజ్ చేసి మెటబాలిక్ హెల్త్‌ని మెరుగ్గా చేస్తుంది. అంతేకాకుండా, ఇందులోని మెగ్నీషియం, పొటాషియం, విటమిన్స్, ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ అన్నీ కూడా షుగర్ ఉన్నవారికి మేలు చేస్తాయి.


కాకరకాయతో కూడా మేలే


కాకరకాయని తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్‌ని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఇందులోని పాలీపెప్టైడ్ పి, చారంటిన్ వంటి పోషకాలన్నీ కూడా గ్లూకోజ్ లెవల్స్‌ని పెరగకుండా చేస్తుంది. ఇందులోని ఫైబర్ షుగర్ అబ్జార్బ్ అవ్వకుండా చేస్తుంది. వీటిని రెగ్యులర్‌గా మీ డైట్‌లో యాడ్ చేసుకోవడం మంచిది. కాకరకాయలోని గుణాలు సహజ ఇన్సులిన్‌లా పనిచేసి అధిక షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేస్తాయి.


బుడం కాయలుతో దిగులుండదు


బుడంకాయలు చూడ్డానికి కాస్తా దొండకాయల్లా కనిపించే ఇవి కూడా భోజనం తర్వాత పెరిగే షుగర్ లెవల్స్‌ని చాలా వరకూ కంట్రోల్ చేస్తాయి. ఇన్సులిన్ మెరుగ్గా పనిచేయడానికి హెల్ప్ చేస్తాయి. కాబట్టి, వీటిని తీసుకోవచ్చు.


మెంతికూరతో మంచి లాభాలు


మెంతి కూర కూడా ఆకుకూరలో మంచి కూర. దీనిని తీసుకోవడం వల్ల చక్కెర శోషణ నెమ్మదింపజేస్తుంది. ముఖ్యంగా, భోజనం తర్వాత చక్కెర స్థాయిలు సడెన్‌గా పెరగవు. వీటిని మీరు ఏంచక్కా కూరలా, పప్పులో, సలాడ్స్‌లో ఇలా ఎలా అయినా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నప్పటికీ చాలా వరకూ షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ఆరోగ్యానికి కూడా మంచిది.


బీరకాయలతో ఆరోగ్యం


బీరకాయల్లో ఎక్కువగా నీటి శాతం ఉంటుంది. వీటిని తినగానే రక్తంలో చక్కెరని కంట్రోల్ అవుతుంది. ఇన్సులిన్ విడుదలకి హెల్ప్ అవుతుంది. కాబట్టి, బీరకాయల్ని కూడా మీరు కూరలు, పచ్చళ్ళు, పప్పులు ఇలా ఎలా అయినా తీసుకోవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల చాలా వరకూ షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి.


షుగర్ లెవల్స్‌ని తగ్గించే ఫుడ్స్


మునగకాయలతో మేలు 


మునగకాయల్లో కూడా మంచి పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల భోజనం తర్వాత షుగర్ లెవల్స్ పెరగవు. కంట్రోల్ అవుతాయి. మొత్తం జీవక్రియని సపోర్ట్ చేస్తుంది. హ్యాపీగా పప్పు, కూరలా ఎలా అయినా వండుకుని తినొచ్చు. దీంతో చక్కగా షుగర్ లెవల్స్ తగ్గుతాయి.


గోరుచిక్కుడుతో కొండంత లాభం


రక్తంలోకి చక్కెర చేరే ప్రక్రియని నెమ్మదింపజేస్తుంది. గోరుచిక్కుళ్ళని తీసుకున్నప్పుడు ఫుడ్ తర్వాత కూడా షుగర్ లెవల్స్ బ్యాలెన్స్‌గా ఉంటాయి. వీటిని తాలింపులా కూరలా ఎలా అయినా చేసుకుని తినొచ్చు.


ఇప్పుడు చెప్పిన కూరగాయలన్నీ షుగర్ ఉన్నవారికి మేలు చేసేవే. కాబట్టి, హ్యాపీగా తినడం అలవాటు చేసుకోండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa