ఏపీ ప్రజలకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువను మరోసారి పెంచుతూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానుంది. దీంతో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగి కొనుగోలుదారులు, విక్రయదారులపై భారం పడనుంది. సగటున 7–8 శాతం, పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో 15 శాతం వరకు విలువ పెరగనుంది. దీనివల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.13,150 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా. అమరావతికి సైతం ఈ పెంపు వర్తించదని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa