మహానంది పుణ్యక్షేత్రంలో ఉభయ టోల్ గేట్ల లైసెన్స్ హక్కుల బహిరంగ వేలం బుధవారం జరిగింది. ఈ వేలంలో అత్యధికంగా రూ. 1,70,20,000 వరకు పాట వెళ్లింది. సీల్డ్ టెండర్లలో దీనికంటే అధిక మొత్తాలకు కూడా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. సెల్ఫోన్ లాకర్లకు రూ. 22.30 లక్షలు, పాదరక్షల భద్రతకు రూ. 11.50 లక్షల వరకు టెండర్లు దాఖలయ్యాయి. ఈ వేలం ద్వారా దేవస్థానానికి గణనీయమైన ఆదాయం సమకూరింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa