కేంద్ర బడ్జెట్ 2026కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో, మరికొద్దిసేపటిలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైనదిగా భావిస్తున్నారు.జనవరిలో స్థూల GST వసూళ్లు 6.2% పెరిగి రూ.1.93 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ప్రధానంగా దిగుమతుల నుండి అధిక ఆదాయం లభించింది. మొత్తం వాపసులు 3.1% తగ్గి రూ.22,665 కోట్లకు చేరుకున్నాయి. అయితే నికర GST వసూళ్లు జనవరిలో 7.6% పెరిగి రూ.1.71 లక్షల కోట్లకు చేరుకున్నాయి.సెప్టెంబర్ 22, 2025 నుండి అమలులోకి వచ్చిన తర్వాత దాదాపు 375 వస్తువులపై GST రేట్లు తగ్గించింది కేంద్రం. దీని వలన వస్తువులు చౌకగా మారాయి. అలాగే గతంలో లగ్జరీ, పొగాకు సంబంధిత ఉత్పత్తులపై మాత్రమే పరిహార సెస్ విధించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa