ఎల్ఆర్ఎస్ కింద టీడీఎస్‌ను 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించారు. గతేడాదితో పోలిస్తే ద్రవ్యలోటు 0.1 శాతం తగ్గింది. 2026-27 నాటికి ద్రవ్యలోటును 4.3 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఖగోళశాస్త్ర పరిశోధనల అభివృద్ధి, ఆసక్తి పెంచేందుకు నేషనల్ లార్జ్సోలార్ టెలిస్కోప్, నేషనల్ లార్జ్ ఇన్ఫ్రారెడ్ టెలిస్కోప్, హిమాలయన్ చంద్ర టెలిస్కోప్, కాస్మోస్-2 ప్లానిటోరియం ఏర్పాటు చేయనున్నారు. తేరవాద, మహాయాన బౌద్ధ క్షేత్రాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించారు. ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రాలకు రూ.1.4 లక్షల కోట్ల నిధులు విడుదల చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa