శ్రీకాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో అంతరాలయ దర్శనాన్ని ఆదివారం పాలకమండలి, అధికారులు ప్రారంభించారు. సామాన్యులకు ప్రాధాన్యమిస్తూ రూ.500 టికెట్‌తో అంతరాలయ దర్శనం కల్పించాలని తీసుకున్న నిర్ణయం మేరకు దీనిని ప్రారంభించారు. ఉదయం 10-11, సాయంత్రం 3-4 గంటల మధ్య అంతరాలయ దర్శనం ఉంటుంది. మొదటి రోజున 438 మంది స్వామివారిని దర్శించుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa