ఏపీని రావణకాష్టంగా మార్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ నేత అనిల్‌కుమార్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ నేతలు వరుసగా వైయస్ఆర్‌సీపీ శ్రేణులపై దాడులకు పాల్పడుతూ ఆటవిక పాలనకు తెరలేపారన్నారు. మరో మూడేళ్లపాటు ఆటవిక పాలన భరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. ‘ కాపు, బీసి నాయకులపై దాడులు శోచనీయం. శ్రీవారి లడ్డు ప్రసాదం దుష్ప్రచారంలో దొరికేసిన కూటమి నాయకులు డైవర్షన్ కోసమే దాడులకు పాల్పడుతున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫ్రస్టేషన్‌లో ఉన్నారు. దమ్ముంటే పోలీసు వ్యవస్థను పక్కన బెట్టి సవాలు విసరండి. మరో మూడేళ్లు ఈ ఆటవిక పరిపాలన భరిస్తాం. 2029లో రిటర్న్ గిఫ్ట ఇచ్చేందుకు రెడీగా ఉన్నాం’ అని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa