ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లోకేష్‌ ఆదేశాలతోనే నా ఇంటిపై దాడికి తెగబడ్డారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 03, 2026, 03:07 PM

భవిష్యత్తులో తనకు, తన కుటుంబానికి ఏ హాని జరిగినా దానికి మంత్రి నారా లోకేషే పూర్తి బాధ్యుడని, ఆదివారం తన ఇంటిపై జరిగిన దాడి కూడా లోకేష్‌ ఆదేశాలతోనే ఎంపీ కేశినేని చిన్ని నేతృత్వంలోనే జరిగిందని మాజీ మంత్రి జోగి రమేష్‌ స్పష్టం చేశారు. ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలోని తన నివాసంలో పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసుల అండతో వారి సమక్షంలోనే టీడీపీ గూండాలు పెట్రోల్‌ బాంబులతో దాడి చేసి తనని, తన కుటుంబాన్ని భౌతికంగా లేకుండా చేయాలన్న కుట్ర చేశారని జోగి రమేష్‌ వెల్లడించారు. తన దైవం తిరుమలేశుడు అని, తన నాయకుడు శ్రీ వైయస్‌ జగన్‌ అని చెప్పారు. మరి ఆ జగన్‌గారిపై నిందలేస్తే ఎలా ఊర్కుంటామని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతులు నొక్కాలని చూస్తున్నారని, తమను ఎలా, ఎంత వేధించినా ఎక్కడా వెనక్కు తగ్గబోమని జోగి రమేష్‌ తేల్చి చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa