ఏపీలో వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి విడదల రజనిపై కేసు నమోదయింది. యడ్లపాడు పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఆమెతో పాటు మరో 21 మంది వైసీపీ నేతలపై కూడా కేసు నమోదయింది.కేసు వివరాల్లోకి వెళితే... గత నెల 30న యడ్లపాడులోని దేవస్థానానికి తన అనుచరులతో పాటు విడదల రజని వెళ్లారు. తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని చెపుతూ... ఆలయాన్ని శుద్ధి చేయడానికి ఆమె యత్నించారు. అయితే, ఆలయంలోకి వెళ్లకుండా టీడీపీ నేతలు ఆమెను అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో లోపలకు వెళతామని వైసీపీ నేతలు పట్టుబట్టడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు వైసీపీ నేతలకు సర్దిచెప్పి వెనక్కి పంపించారు. ఈ క్రమంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించారంటూ విడదల రజని, ఆమె అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa