ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారతీయ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి సంబంధించిన ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 08, 2026, 06:32 AM

ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి సంబంధించిన ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికాలో లైంగిక నేరాలకు పాల్పడి, జైలులో ఆత్మహత్య చేసుకున్న జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తేలింది. వీరిద్దరి మధ్య జరిగిన వాట్సాప్ సందేశాలు, సంభాషణల వివరాలను అమెరికా న్యాయ శాఖ తాజాగా విడుదల చేసిన పత్రాల్లో బయటపెట్టింది. ఈ డాక్యుమెంట్ల ప్రకారం, 2017 నుంచి 2019 మధ్యకాలంలో వీరి మధ్య పలుమార్లు సంభాషణలు జరిగాయి.ఈ సందేశాలతో పాటు వీరి మధ్య వ్యాపారం, ప్రపంచ వ్యవహారాలు, పారిస్‌లో కలుసుకునే ప్రణాళికల గురించి కూడా చర్చలు జరిగాయి. 2018లో దావోస్‌లో జరిగిన సదస్సులో డొనాల్డ్ ట్రంప్‌ గురించి కూడా మాట్లాడుకున్నారు. 2019 మేలో అనిల్ అంబానీ న్యూయార్క్ వస్తున్నట్లు చెప్పగా, తన నివాసానికి రావాలని, అవసరమైన వ్యక్తులతో రహస్యంగా సమావేశాలు ఏర్పాటు చేస్తానని ఎప్‌స్టీన్ ఆహ్వానించాడు. వీరిద్దరూ కలుసుకున్నట్లు వారి సహాయకులు కూడా ధృవీకరించారు. అంతేకాకుండా, అనిల్ అంబానీ హాలీవుడ్ కనెక్షన్ల గురించి చెబుతూ, నటి స్కార్లెట్ జోహాన్సన్‌తో తదుపరి సినిమా ఉందని పేర్కొనగా, తనకు "యంగ్ బ్లాండ్స్" యువరాశులైన అందమైన అమ్మాయిలు ఇష్టమని ఎప్‌స్టీన్ హాస్యంగా స్పందించాడు.ఈ ఆరోపణలపై స్పందించేందుకు అనిల్ అంబానీ ప్రతినిధి నిరాకరించారు. ఒకప్పుడు బిలియనీర్‌గా వెలుగొందిన అనిల్ అంబానీ ఆస్తులు ఇటీవలి కాలంలో గణనీయంగా తగ్గాయి. భారత్‌లో బ్యాంకు రుణాల ఎగవేత కేసులోనూ ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో లైంగిక నేరస్థుడిగా ముద్రపడిన ఎప్‌స్టీన్‌తో ఆయనకు సంబంధాలు ఉన్నట్లు బయటపడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2019లో సెక్స్ ట్రాఫికింగ్ ఆరోపణలపై అరెస్ట్ అయిన ఎప్‌స్టీన్, విచారణ కొనసాగుతుండగానే జైలులో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa