మేషరాశి.... (అశ్విని 1 2 3 4,భరణి 1 2 3 4,కృతిక 1వ పాదం) (నామ నక్షత్రములు: చూ, చే ,చొ, లా,లీ, లూ, లే, లో,ఆ)వారం ప్రారంభంలో కుటుంబము, ఆర్థిక, భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి, కమ్యూనికేషన్ బావుంటుంది. జీవిత భాగస్వామి కి అభివృద్ధి. సంఘంలో గుర్తింపు గౌరవం పెరుగుతాయి. తల్లి సహకారంతో నిర్ణయాలు. వ్యక్తిగత అభివృద్ధి మీద దృష్టి సారిస్తారు. ఆకస్మిక ఖర్చులు, ఆరోగ్యం పై శ్రద్ధ అవసరం . మానసిక ఘర్షణ అధిగమించాలి. ధైర్య సాహసాలు పెరుగుతాయి.వృత్తి విషయాలలో, విద్యాపరమైన అంశాలలో అభివృద్ధి. విదేశీ వ్యవహారాలు, విద్యా నైపుణ్యాలు, పోటీలు అనుకూలిస్తాయి. కుటుంబము లోని వారితో ఆధ్యాత్మిక దూర ప్రయాణాలు. ఉన్నత విద్య కొరకు క్రొత్త ఆలోచనలు. పెద్దల, గురువుల ఆశీస్సులు సహకారం. తల్లిదండ్రులతో కలిపి భవిష్యత్ ప్రణాళికలు చర్చిస్తారు. బంధుమిత్రుల కలయిక. ఆత్మీయులైన మిత్రులతో దీర్ఘకాలిక అంశాలలో నిర్ణయాలు. మరిన్ని మంచి ఫలితాలు కొరకు హనుమాన్ ఆరాధన మేలు.
వృషభరాశి...(కృతిక 2,3,4,రోహిణి 1 2 3 4,మృగశిర 1 2 పాదాలు) (నామ నక్షత్రములు:ఈ, ఊ, ఎ, ఓ, వా, వీ, వూ, వె, వో)
వారం ప్రారంభం స్నేహితుల సహకారాన్ని పొందుతారు. అధిక శ్రమతో అనుకున్న పనులు సాధించుకుంటారు. వృత్తిపరంగా నూతన నిర్ణయాలు ప్రణాళికలు, దూర ప్రదేశాల్లో అవకాశాలు, విదేశీ వ్యక్తులతో స్నేహ సంబంధాలు. నిత్యజీవితంలో దినచర్యలో, అలవాట్లలో మార్పులు చేసుకుంటూ రోగ నిరోధక శక్తిని పెంపొందించు కునే ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక విషయాలు వృద్ధి, సంతాన అభివృద్ధి, సమయస్ఫూర్తి నిర్ణయాలు. కమ్యూనికేషన్ అనుకూలముగా ఉంటుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. స్నేహ సంబంధాలలో, భాగస్వామ్య వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలకి, ఘర్షణలకు దూరంగా ఉండాలి.జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాలు శ్రద్ధ. వారం చివరిలో ఆర్థిక నిర్ణయాలలో కీలక మార్పులు. ముఖ్య విషయాలు, ప్రయాణాలు, వాగ్దానాలు మొదలైన వాటిలో చిన్నపాటి ఆటంకాలు ఉన్నప్పటికీఅధికమించగలుగుతారు. దంతఆరోగ్యం మీద శ్రద్ధ అవసరం. మరిన్ని మంచి ఫలితాల కొరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మేలు.
మిధున రాశి...(మృగశిర 3 4,ఆరుద్ర 1 2 3 4,పునర్వసు 1,2,3 పాదాలు) (నామ నక్షత్రములు: కా, కి, కూ, ఖం , జ్ఞ, చ్చ, కే, కో, హ, హి)
సృజనాత్మకత ఆలోచనలలో జోడించి, కొత్త నిర్ణయాలతో ముందుకు వెళతారు. సంతానం విద్యా ఉద్యోగాలలో అభివృద్ధికరంగా ఉంటుంది. ఆలోచనలు ఫలిస్తాయి. స్నేహ సంబంధాలు మీద శ్రద్ధ చూపిస్తారు. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో, పూర్వ రుణముల విషయంలో ఆలోచనలు చేస్తారు. బంధు వర్గము తో మాట పట్టింపులకు దూరంగా ఉండాలి. న్యాయ సంబంధమైన విషయాలలోప్రత్యర్థుల పై విజయం కొరకు, నిరుద్యోగులు ఉద్యోగ విషయంలోనూ, విద్యార్థులు పోటీ పరీక్షలలోనూ అధిక శ్రమ చేస్తారు. కృషి శీలతను పెంపొందించుకుంటారు. వారాంతంలో స్నేహ సంబంధాలు బలపడతాయి, నూతన పరిచయాలు ఏర్పడతాయి, సంఘంలో గుర్తింపు గౌరవం లభిస్తుంది, వృత్తిపరమైన శ్రమ బాధ్యతలు అధికంగా ఉంటాయి. ఉన్నత స్థాయి అధికారులతో అభిప్రాయ బేధాలు ఏర్పడకుండా చర్చించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి ఫలితాల కొరకు ఆదిత్య హృదయ పారాయణ మేలు.
కర్కాటక రాశి...(పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4 పాదాలు) (నామ నక్షత్రములు: హి, హూ, హే, హో, డా, డీ ,డూ, డే, డో)
వారం ప్రారంభంలో గృహ వాతావరణంలో మార్పులు చేర్పులు చేయడానికి ప్రయత్నిస్తారు. నూతన అంశాలు నేర్చుకుంటారు. స్థిరాస్తుల విషయంలో దృష్టి కేంద్రీకరిస్తారు. విద్యార్థులు విద్య పై దృష్టి సారించాలి. హైగ్రివాయ నమః శ్లోకాన్ని పఠించాలి. తల్లి ఆరోగ్యం పై శ్రద్ధ తీసుకుంటారు.వాహన విషయాలలో ఇబ్బందులు ప్రశాంతతను తగ్గిస్తాయి. సమయానికి ఆహార స్వీకరణ, వ్యక్తిగత జాగ్రత్తలు అవసరం. స్నేహ సంబంధాలలో, భాగస్వామ్య వ్యవహారాలలో మాట పట్టింపులకు దూరంగా ఉండాలి. సంతాన విషయాలలో అధికంగా దృష్టి సారిస్తారు. మీ ఆలోచనలు వారి ఆలోచనలతో సమన్వయముకాక పోవడం వల్ల ఘర్షణలకు దారితీసే అవకాశం ఉన్నప్పటికీ,మీరు అధిక ఉద్వేగాలకు దూరంగా, వీలైనంత నిదానంగా ముందుకు సాగడం మేలు. వారాంతంలో శ్రమ, ఖర్చులు అధికం. ఆధ్యాత్మిక విషయాల మీద దృష్టి సారిస్తారు, తత్సంబంధ ప్రయాణాలకు, పెట్టుబడులకు ప్రణాళికలు. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు. మంచి ఫలితాల కొరకు దత్తాత్రేయఆరాధన మేలు.
సింహరాశి...(మఖ 1 2 3 4, పుబ్బ 1 2 3 4, ఉత్తర 1వ పాదం) (నామ నక్షత్రములు: మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే)
ప్రారంభంలో అధిక శ్రమతో లక్ష్యాన్ని ఏర్పరచుకొని సామర్థ్యాన్ని ఉపయోగించి అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు.ప్రయాణాలు, ఆత్మీయ వ్యక్తుల కొరకు ఖర్చులు చేస్తారు. దూర ప్రదేశాలలో వ్యాపార వ్యవహారాలు, స్నేహ సంబంధాలు, తోబుట్టువులతో చర్చలలో కమ్యూనికేషన్ సమస్యలు ఎదురవుతున్నప్పటికీ తెలివితేటలతో వాటిని అధిగమించగలరు. కళాకారులకు నూతన అవకాశాలు. ఆర్థిక విషయాలు అనుకూలం. స్థిరాస్తుల , రుణముల విషయంలో,కుటుంబంలోని స్త్రీల ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. వాహనములను నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు అవసరం. విద్యార్థులు పోటీలలో శ్రమతో విజయ అవకాశాలు. వారాంతంలో మానసిక ప్రశాంతత పెరుగుతుంది, సంతానము అభివృద్ధి, విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆత్మీయుల కొరకు ఖర్చులు ఆనందాన్ని కలిగిస్తాయి. పెట్టుబడుల కొరకు ఆలోచనలు. మంచి ఫలితాల కొరకు దుర్గా దేవి ఆరాధన మేలు.
కన్యా రాశి...(ఉత్తరఫల్గుణి 2 3 4,హస్త 4,చిత్త 1 2 పాదాలు) (నామ నక్షత్రములు: టో,పా,పి,పూ,షం,ణా,పే,పో)
ప్రారంభంలోకుటుంబంలో మాట విలువ, ఆర్థిక విషయాల కి ప్రాధాన్యత ఇస్తారు. యదార్థవాది బంధు విరోధి అన్నట్లుగా, మాట్లాడేటప్పుడు కొన్ని అభిప్రాయ బేధాలు వచ్చే అవకాశం వున్న రీత్యా ఆచితూచి వ్యవహరించడం మేలు. కొత్త ప్రదేశాల్లో ఆహారం స్వీకరించేటప్పుడు ఆరోగ్య శ్రద్ధ అవసరం. ఆర్థిక విషయాలు మిశ్రమం ఖర్చులు అధికం. వాగ్దానాలలో మాట నిలబెట్టుకోవడానికి అధికశ్రమ. కుటుంబంలోని స్త్రీల కంటి ఆరోగ్యం గురించి శ్రద్ధతీసుకుంటారు.రుణములు చేసి పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాల లో నూతన వ్యక్తులు పరిచయాలు. ఆత్మీయులతో కలిపి ముఖ్యంగా భూసంబంధ విషయాలలో చర్చలు జరిపేటప్పుడు ఉద్వేగాలను అధిగమించాలి. వ్యక్తుల సహకారం ఆశించిన స్థాయిలో లేనప్పటికీ, అందినంతవరకు సద్వినియోగ పరుచుకోవాలి. తల్లి ఆరోగ్యం అనుకూలం, స్థిరాస్తుల మీద దృష్టి కేటాయిస్తారు. వృత్తి ఉద్యోగ బాధ్యతలు, గృహ సంబంధ అంశాలు, సమన్వయ పరచుకుంటూ ముందుకు వెళతారు. విగ్నేశ్వరునిఆరాధన మేలు.
తులా రాశి...(చిత్త 3 4,స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: రా, రి, రూ, రె, రో, తా, తీ, తూ, తే)
ప్రారంభములో వృత్తిపరమైన అంశాలలో శ్రద్ధ, నూతన నిర్ణయాలు ఆలోచనలు చేస్తారు. కొత్త ఉత్సాహంతో ముందుకు వెళతారు. స్నేహ సంబంధాలు అనుకూలంగా ఉంటే. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆత్మీయులతో కలిపి చర్చలు చేస్తారు. వారి కొరకు ఖర్చులు. దూర ప్రదేశాలలో ఉన్న సంతాన విషయంలో పెట్టుబడుల కొరకు నిర్ణయాలు. సృజనాత్మకత పెరుగుతుంది. ఆరోగ్యం అనుకూలం, దీర్ఘకాలిక అనారోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, ముఖ్యంగా వృత్తి వ్యాపారాలు, స్థిరాస్తుల విషయంలోనూ, ఆర్థిక నిర్ణయాల లోనూ అహం సమస్యలకు దూరంగా ఉండటం మేలు. వారాంతంలో అనుకున్న పని అనుకున్న సమయంలో సంపూర్ణ సామర్థ్యాన్ని ఉపయోగించి పూర్తి చేస్తారు. వ్యక్తుల సహకారం అనుకూలం. ప్రత్యర్థుల మీద విజయం సాధిస్తారు. దూర ప్రయాణాలకు అవకాశం. పెద్దలు గురువుల యొక్క ఆశీస్సులు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మేలు.
వృశ్చిక రాశి...(విశాఖ 4,అనురాధ 1 2 3 4, జేష్ఠ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: తో, నా, నీ, నూ, నె, నో, యా, యీ, యు)
ప్రారంభంలో కుటుంబ విషయాలలో వృత్తిపరమైన అంశాలలో అధిక శ్రమ ఒత్తిడి, ఆకస్మిక దూర ప్రయాణాలకు అవకాశం. సమయానికి ఆహార స్వీకరణ, విశ్రాంతి, నిద్ర అవసరం. తండ్రి ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. గృహ వాహన విషయాల కొరకు ఖర్చులు. ఆధ్యాత్మిక విషయాల కొరకు ఆలోచనలు. ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసిన వారి మీద విజయం సాధిస్తారు.ధైర్య సాహసాలు పెరుగుతాయి. వృత్తిలో ఉన్నత స్థాయి, పలుకుబడి కలిగిన ఆత్మీయ వ్యక్తుల సహకారం అనుకూలం. గౌరవం, పదవికి నూతన అవకాశాలు. జీవిత భాగస్వామి సలహాతో ముందుకు వెళతారు. కుటుంబ విషయాలకి, సంతాన అభివృద్ధికి అధికంగా ఖర్చులు. ఆధ్యాత్మిక వ్యక్తుల సహకారం, ఆశీస్సులతో పనులను సాధించుకుంటారు. పనిచేసే ప్రదేశాలలో మాట విలువ పెరుగుతుంది. మంచి మాటలతో, చక్కని ఆలోచనలతో సంతానానికి మార్గ నిర్దేశం చేస్తారు. వారసత్వ ఆస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. రీసెర్చ్ స్కాలర్స్ కి అనుకూలం. మంచి ఫలితాలకై నారాయణస్వామి ఆరాధన మేలు.
ధను రాశి...(మూల 1 2 3 4,పూర్వాషాఢ 1 2 3 4,ఉత్తరాషాఢ 1వ పాదం) (నామ నక్షత్రములు: యే, యో, భా,భీ, భూ, ధ, ఫ, డా, భే)
ప్రారంభంలో ఎదురుచూస్తున్న విషయాలు, వర్తమానాలు అనుకూలంగా ఉంటాయి. విదేశాలలో ఉన్న ఆత్మీయ వ్యక్తులు సహకరిస్తారు. భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ధైర్య సాహసాలు, క్రీడల పై ఆసక్తి పెరుగుతుంది. నిర్ణయ సామర్థ్యం అనుకూలం. దూర ప్రదేశాలలో మిత్రులతో చర్చలు, నెట్వర్క్ పెంపొందించుకుంటారు. ఆన్లైన్ షాపింగ్, మార్కెటింగ్ చేస్తారు. ఖర్చులు అధికం. నిద్రలేమిని అధిగమించాలి. మొబైల్, కంప్యూటర్ తో అధిక సమయం కంటి ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్న దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వారాంతంలో విందు వినోదాలు కొరకు ఖర్చులు. ఎసిడిటీని అధిగమించాలి. కొత్త ఆలోచనలు, నూతన ఉత్సాహం, వ్యక్తిగత విషయాల కొరకు ఆకస్మిక ఖర్చులు. ఇమ్యూనిటీ, ఆరోగ్య విషయంలో శ్రద్ధతో ముందుకెళ్లాలి. సంఘంలో గుర్తింపు, శ్రమకి తగిన గౌరవం పొందుతారు. స్థిరాస్తుల విషయంలో ఖర్చులు చేసిన,మంచి నిర్ణయం తీసుకుంటారు. వెంకటేశ్వర స్వామి ఆరాధన మేలు.
మకర రాశి...(ఉత్తరాషాఢ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ఠ 1 2 పాదాలు) (నామ నక్షత్రములు: భ,జా,జి,ఖి,ఖు,ఖే,ఖో,గా,గి)
వారం ప్రారంభంలో జీవిత భాగస్వామి సహకారంతో వృత్తి వ్యాపారాల మీద శ్రద్ధ తీసుకుంటారు. స్నేహ సంబంధాలు అనుకూలం. మాట విలువ, గౌరవం, ఆర్థిక విషయాలనుకులం. కమ్యూనికేషన్ బాగుంటుంది. విదేశీ ప్రయాణాలకు అవకాశం. దూర ప్రదేశాల నుంచి వర్తమానం ఆనందాన్నిస్తుంది. చిన్ననాటి మిత్రులు కలుస్తారు. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. దంత ఆరోగ్య విషయంలో శ్రద్ధ. స్థిరాస్తులు, వాహనాలు అనుకూలం. తల్లి గారి ఆరోగ్యం, సహకారం బాగుంటుంది. విద్యార్థులకు అనుకూలం. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో, ఉన్నత స్థాయి అధికారులతో సంప్రదించేటప్పుడు తగినట్లు వినయంగా వ్యవహరించి పనులు సాధించుకోగలగాలి. జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులకు అవసరమైన చోట కొంతవరకు సహకారాన్ని అందిస్తారు. దీర్ఘకాలిక అనారోగ్యాల విషయంలో అధిగమించడానికి దృష్టి సారిస్తారు. మంచి ఫలితాల కొరకు ఇష్ట దేవత ఆరాధన మేలు
కుంభ రాశి...(ధనిష్ట 3 4, శతభిషం 1 2 3 4, పూర్వాభాద్ర 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: గూ, గే, గో, సా, సి, సు, సే, సో, దా)
వారం ప్రారంభంలో ప్రత్యర్థుల మీద విజయ సాధనకు, విద్యార్థులు పోటీలలో నెగ్గటానికి అధిక శ్రమతో ముందుకు వెళతారు. కుటుంబ వ్యక్తుల సహకారం అనుకూలం. వృత్తిపరమైన అంశాలలో ప్రయాణాలు, శ్రమ.ప్రశాంతత తక్కువ, నిద్రలేమి, అనవసర ఖర్చుల్ని నియంత్రించుకోవాలి. వాహనాల నడిపేవారు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్లాలి. పూర్వపు రుణములను వ్యక్తుల నుంచి తిరిగి పొందడం కష్టమనే భావనకి వస్తారు. వృత్తి పరంగా అధికారులతో, కొలీగ్స్ తో ఘర్షణలకు దూరం మేలు. కోపాన్ని నియంత్రించుకోవాలి. నూతన వృత్తిల కొరకు ప్రయత్నం చేసే వారికి శ్రమకి తగిన ఫలితం. ఆశించిన ప్రయోజనాలు పొందుతారు. ఆత్మీయ వ్యక్తులతో అనుకూలం. ఆర్థిక విషయాలు లాభిస్తాయి, దూర ప్రదేశాలలోని ప్రియమైన వ్యక్తులు సహకరిస్తారు. కుటుంబము సంతానము అభివృద్ధి. మంచి ఫలితముల కొరకు నవగ్రహ ఆరాధన మేలు.
మీన రాశి...(పూర్వాభాద్ర 4,ఉత్తరాభాద్ర 1 2 3 4,రేవతి 1 2 3 4 పాదాలు)(నామ నక్షత్రములు: దీ , దు, ఇ+, ఝ, ధా, దే, దో, చా, చి)
వారం ప్రారంభంలో ఆలోచనలలో అలసత్వం, మానసిక ప్రశాంతత తక్కువ. అనారోగ్యము కన్నా, అనారోగ్య భావనల అధికం. ముఖ్యమైన పనులలో ఆలస్యాలు ఆటంకాలు. భాగస్వామ్య వ్యవహారాలలో, జీవిత భాగస్వామి, సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ధ. అధిక ఖర్చులను నియంత్రించాలి. వారసత్వ ఆస్తుల విషయంలో, స్థిరాస్తులను పెంపొందించుకునే అంశంలో అధిక ఆలోచనలు. తండ్రి, పెద్దల యొక్క సహకారం అనుకూలం. ఉన్నత విద్య ప్రణాళికలు, మంచి గురువులభ్యం. అసంతృప్తిని అధిగమిస్తూ, పుణ్య బలాన్ని పెంపొందించుకుంటారు. భూ సంబంధ విషయాలలో నిర్ణయాలు. కొత్త విషయాల కొనుగోలులో నూతన వ్యక్తులను నమ్మి నిర్ణయాలు తీసుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు అవసరం. వృత్తిపరమైన విషయాల అధిక శ్రమ బాధ్యతలు. అభివృద్ధి విషయాలలో జాప్యం. మంచి ఫలితాల కొరకు వెంకటేశ్వర స్వామి ఆరాధన వేలు.
(గమనిక: గోచార రీత్యా చెప్తున్న రాశి ఫలితాలు జనరల్ వి, వ్యక్తిగతంగా ఉద్దేశించి చెబుతున్నవి కావు, వ్యక్తిగత జన్మజాతకంలో అనగా వ్యక్తి జన్మ కుండలి (జన్మించిన సమయం, తేదీ, ప్రదేశం ఆధారంగా నిర్మించేది) ప్రకారం నడిచే దశలు అంతర్దశలు ప్రధానంగా చూసుకుంటూ ఆ దశ అంతర్దశలకు సంబంధించిన దానికి తగిన పరిహారాలు పాటించుకుంటూ, దానితో పాటు ఈ గోచార ఫలితాలను చూసుకోవాలి. గోచార రీత్యా రాశి ఫలాలు అశుభము గా ఉండి దోషాలు ఉన్నప్పటికీ, జననకాల దశ ఫలములు శుభము గా ఉంటే రాశి ప్రస్తుత అశుభ ఫలితాలు స్వల్పంగానే ఉంటాయి. చిన్న చిన్న పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరు).
డా|| ఈడ్పుగంటి పద్మజారాణి / Dr Edupuganti Padmaja Rani
జ్యోతిష్యము & వాస్తు నిపుణురాలు / Astrology & Vaastu Consultant
email : padma.suryapaper@gmail.com
www.padmamukhi.com
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa