ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తన బంధువు పెళ్లికి హాజరయ్యేందుకు తమిళనాడు వెళ్లారు. చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్లో వైఎస్ సునీల్ రెడ్డి (వైఎస్ జగన్ పెదనాన్న వైఎస్ జార్జిరెడ్డి కుమారుడు) కుమారుడి వివాహం జరిగింది. ఈ పెళ్లికి తన తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతితో కలిసి వెళ్లిన వైఎస్ జగన్ నూతన వధూవరులు సాహిల్, వేదికలకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. ఇక ఇదే వివాహానికి సీనియర్ నటులు మోహన్ బాబు కూడా వెళ్లారు. ఇక తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ కూడా హాజరయ్యారు. హీరోలు సూర్య, కార్తి సోదరులు కూడా వైఎస్ జగన్ను కలిసి ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. ఇక ఇదే వివాహానికి హీరో, తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీ మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, విడదల రజిని వంటి వైసీపీ నేతలు కూడా హాజరయ్యారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa