ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"చంద్రుడిపై సివిలైజేష‌న్" అంటూ వీడియో రిలీజ్ చేసిన ఎలాన్ మస్క్

international |  Suryaa Desk  | Published : Tue, Feb 10, 2026, 03:13 PM

ప్రముఖ పారిశ్రామికవేత్త, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తన ప్రతిష్ఠాత్మక లక్ష్యాలతో ప్రపంచాన్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. తాజాగా ఆయన చంద్రుడిపై మానవ నాగరికత ఎలా ఉంటుందో చూపిస్తూ ఒక ఆసక్తికరమైన వీడియోను పంచుకున్నారు. "చంద్రుడిపై సివిలైజేష‌న్" అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను షేర్ చేసి, తన భవిష్యత్ ప్రణాళికలపై కొత్త చర్చకు తెరలేపారు.అసలు విషయం ఏంటంటే, 'మూన్ 2042' పేరుతో గ్రోక్ ఏఐ రూపొందించిన ఒక వీడియోను @DogecoinNorway అనే యూజర్ ఎక్స్‌ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఆ వీడియోనే మస్క్ తిరిగి షేర్ చేశారు. ఈ వీడియోలో చంద్రుడి ఉపరితలంపై డోమ్ ఆకారంలో భారీ నిర్మాణాలు, వాటి మధ్య స్వేచ్ఛగా తిరుగుతున్న వ్యోమగాములు, అత్యాధునిక టెస్లా వాహనాలు కనిపించాయి. అలాగే, ఆస్ట్రోనాట్ సూట్లలో చిన్నారులు ఆడుకుంటున్న దృశ్యాలు కూడా ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa