ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభలోనే అస్వస్థతకు గురి కావడం తీవ్ర కలకలం రేపింది. దీంతో వెంటనే వంగలపూడి అనితను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. గురువారం రోజున ఏపీ శాసనసభతో పాటు శాసనమండలిలో కూడా చర్చకు ఆమె హాజరు అయ్యారు. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై జరిగిన చర్చలోనూ హోంమంత్రి అనిత పాల్గొని మాట్లాడారు.
ఈ క్రమంలోనే శాసనమండలిలో అధికార కూటమి.. విపక్ష వైసీపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో సభ వాయిదా పడింది. ఇక శానససభ మాత్రం కొనసాగుతోంది. ఆ సమయంలోనే హోం శాఖ మంత్రి అనిత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే స్పందించిన ఆమె సిబ్బంది.. అనితను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి.. ఆ తర్వాత విజయవాడ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమెకు ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. అనితను పరీక్షించిన డాక్టర్లు బీపీ ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారించారు.
ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు, హోం శాఖకు సంబంధించిన వరుస కార్యక్రమాలతో వంగలపూడి అనిత బిజీబిజీగా ఉన్నారు. గత వారం రోజుల నుంచి ఆమె అసలు విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే వంగలపూడి అనిత అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. అయితే ఆమె పరిస్థితిపై ఆందోళన అవసరం లేదని.. సాయంత్రం వరకు ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని ఆమె వ్యక్తిగత సిబ్బంది చెప్పినట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa