ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కలలో దేవుడు కనిపిస్తే శుభమా? అశుభమా?

Astrology |  Suryaa Desk  | Published : Thu, Mar 05, 2026, 07:51 PM

సైన్స్ ప్రకారం కలలు ఉపచేతన మనస్సు ప్రతిబింబాలు అయినప్పటికీ, ఆధ్యాత్మికంగా వీటికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. కలలో దేవుడు కనిపించడం అనేది జీవితంలో రాబోయే మార్పులకు సూచన. ముఖ్యంగా కష్టాల్లో ఉన్నప్పుడు దైవ దర్శనం కలిగితే అది ఊరటనిస్తుంది. స్వప్న శాస్త్రం ప్రకారం, కలలో దేవుడు నవ్వుతున్నట్లు కనిపిస్తే ధనలాభం, చేపట్టిన పనుల్లో విజయం, శుభకార్యాలు జరుగుతాయని అర్థం. దేవుడి విగ్రహాన్ని చూడటం ఆందోళనలు తొలగి ప్రశాంతత లభిస్తుందని, కెరీర్ పరంగా కొత్త అవకాశాలు వస్తాయని సూచిస్తుంది. దేవుడు మీతో మాట్లాడితే మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. గుడికి వెళ్ళినట్లు కల వస్తే దోషాలు తొలగి సమస్యలు పరిష్కారమవుతాయి. అయితే, విగ్రహం పగిలిపోవడం లేదా దేవుడు కోపంగా ఉండటం వంటివి అశుభ సంకేతాలు. తెల్లవారుజామున 3 నుండి 5 గంటల మధ్య వచ్చే కలలు నిజమయ్యే అవకాశాలు ఎక్కువ.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa