ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నా మాటలని వక్రీకరించారంటూ ప్రముఖ సోషల్ మీడియా ఖాతాపై మండిపడ్డ కస్తూరి

national |  Suryaa Desk  | Published : Thu, Feb 12, 2026, 03:04 PM

నటి, బీజేపీ నేత కస్తూరి శంకర్ ఓ మీడియా సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్‌పై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి, తప్పుడు వార్త ప్రచురించారని ఆమె మండిపడ్డారు. తాను అనని మాటలను ప్రచారం చేసినందుకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.వివరాల్లోకి వెళితే.. "పార్లమెంటులో కమల్ హాసన్ తెలుగులో తన ప్రసంగం ప్రారంభించడం తమిళులను అవమానించడమేనని కస్తూరి అన్నారు" అంటూ 'ఉత్తరాంధ్ర నౌ' తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్‌పై కస్తూరి తీవ్రంగా స్పందించారు. ఇది పూర్తిగా అసత్యమని, దురుద్దేశపూరితమైన కథనమని ఆమె మండిపడ్డారు.ఈ విషయంపై ఆమె స్పందిస్తూ, "నేను అన్నదేమిటి, మీరు రాసిందేమిటి? ఈ తప్పుడు, పరువు నష్టం కలిగించే వార్తను ఎలా సృష్టించారు? త్యాగబ్రహ్మాన్ని కించపరిచి, తెలుగు భాషను అవమానించినందుకు నేను కమల్‌ను విమర్శించాను. అంతేగానీ మీరు పేర్కొన్నట్టుగా నేను ఏమీ అనలేదు. వెంటనే మీ ఫేక్ న్యూస్‌ను వెనక్కి తీసుకోండి. నా ప్రసంగానికి సరైన అనువాదం ప్రచురించి, క్షమాపణ చెప్పండి" అంటూ 'ఉత్తరాంధ్ర నౌ'ను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa