జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు వేర్వేరుగా కలిశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి ఛాంబర్లో బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరువురు ప్రస్తుత పరిణామాలు, వివిధ అంశాలపై చర్చించినట్లుగా సమాచారం. ఆ తర్వాత నాగబాబు కూడా సోదరుడిని కలిశారు. ఇదిలా ఉండగా, గిద్దలూరు నియోజకవర్గం సమస్యలపై పవన్ కల్యాణ్‌కు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి వినతి పత్రం అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa